Vishnupriya: మీ ప్రేమ, ఆదరణ, టైమ్ నాకిచ్చి నన్ను విజేతగా చేస్తారని ఆశిస్తున్నా
on Dec 6, 2024
బిగ్ బాస్ సీజన్-8 చివరి దశకు చేరుకుంది. ఇందులో ఇప్పటికే ప్రేరణ, నబీల్ ఓట్ అప్పీల్ చేసుకున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో రోహిణి, విష్ణుప్రియ చెరో టాస్క్ గెలిచారు. వీరిద్దరిలో ఎవరు ఓట్ అప్పీల్ కి అర్హులు కాదని అనుకుంటున్నారో చెప్పమని కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ చెప్పగా.. అవినాష్ మినహా అందరు విష్ణుప్రియకి సపోర్ట్ చేశారు. ఇక తను ఓట్ అప్పీల్ కి సెలెక్ట్ అయ్యింది. ఓట్ అప్పీల్ లో తనేం మాట్లాడిందో ఓసారి చూసేద్దాం.
ఓట్ అప్పీల్ కోసం ఇన్‌ఫినిటీ రూమ్‌కి వెళ్లింది విష్ణుప్రియ. ఇప్పటివరకు చాలా షోలలో నన్ను చూసి ఆదరించి ఈ స్థాయి వరకూ నన్ను తీసుకొచ్చినందుకు థాంక్యూ.. ఇప్పటివరకు నన్ను మెచ్చి నా గురించి కొంచెమే తెలుసుకున్నారు.. బట్ ఈ షోకి వస్తే నా మొత్తం స్వభావం మీకు తెలిసి నచ్చినవాళ్లకి ఇంకా చేరువవుతాను.. ఇప్పటివరకు నన్ను మెచ్చి ఇంతవరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్స్.. నా బిహేవియర్ నచ్చని వాళ్లకి ఐయామ్ సారీ.. బట్ నన్ను నన్నుగా ప్రేమించి ఇంత దూరం తీసుకొచ్చినందుకు ఈ పద్నాలుగు వారాలు ఈ షోలో ఇక్కడి వరకు తెచ్చినందుకు థాంక్యూ.. ఇంకా ఒక్క వారం దగ్గరిలో ఉన్నాను.. మీ ప్రేమ, ఆదరణ మీ టైమ్ నాకు ఇచ్చి నన్ను విజేతగా చేస్తారని ఆశిస్తున్నానంటూ విష్ణుప్రియ చెప్పింది.
నాకు వీలైనంత నిజాయితీగా వంద శాతం ఇవ్వడానికి నేను ట్రై చేశాను.. అలానే ఈ సీజన్‌కి నేను ఓ మహిళా విజేతగా నిలవాలనుకుంటున్నాను.. ఇప్పటివరకు బిగ్‌బాస్‌లో అవ్వలేదు.. ఆ కోరిక తీసుకొని ముందుకొచ్చాను.. నేను విజేత కావాలని కోరుకుంటున్నాను.. నా కోరిక మీరు మనస్ఫూర్తిగా తీరుస్తారని ఆశిస్తున్నాను.. మీ ఓట్ నా గెలుపు అవుతుంది.. ఇక్కడి వరకూ తీసుకొచ్చినందుకు థాంక్స్.. ఇంకా ఒక్క వారమే ఉంది.. మీ టైమ్ నాకు ఇవ్వండి అంటూ విష్ణుప్రియ రిక్వెస్ట్ చేసింది.
Also Read